ఏపీ ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ గా కె.విజయానంద్... బాధ్యతల స్వీకరణ

Jun 9, 2022, 3:49 PM IST

అమరావతి : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ గా కె.విజయానంద్ ఇవాళ (గురువారం) బాధ్యతలు చేపట్టారు. అమరావతి సచివాలయం రెండో బ్లాక్ లోని రాష్ట్ర ఇంధన శాఖ స్పెషల్ సిఎస్ ఛాంబరులో జెన్కో మేనేజింగ్ డైరెక్టర్ బి.శ్రీధర్ నుండి ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. విజయానంద్ బాధ్యతలు చేపట్టిన వెంటనే జన్కో మేనేజింగ్ డైరెక్టర్ శ్రీధర్, ఏపి ట్రాన్స్ కో జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఐ.పృధ్వీ తేజ్, నెడ్ క్యాప్ మేనేజింగ్ డైరెక్టర్ రమణారెడ్డి తదితరులు ఆయనకు పుష్కగుచ్చాలు అందజేసి అభినందనలు తెలియజేశారు.