Jul 7, 2022, 4:22 PM IST
వేములవాడ : తెలంగాణలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటయిన వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవాలయ ఈవోకు, స్థానిక బిజెపి నాయకులకు మధ్య వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈవో తీరును వ్యతిరేకిస్తూ ఇవాళ బిజెపి వేములవాడ బంద్ చేపట్టగా... బిజెపి నాయకులపై ఈవో సంచలన ఆరోపణలు చేసారు. స్థానిక బిజెపి నాయకులు తనను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని... చివరకు ప్రాణాలకు హాని కలిగుతుందేమోనని భయపడే పరిస్థితి వచ్చిందని ఈవో రమాదేవి ఆందోళన వ్యక్తం చేసారు. హైదరాబాద్ నుండి వచ్చేక్రమంలో ఎటునుండి ఏ ప్రమాదం దూసుకువస్తుందోనని భయపడిపోతున్నానని అన్నారు. వేములవాడ వాసులు కాకుండా భయటివారు ఇక్కడ సమస్యలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని వేములవాడ ఈవో తెలిపారు.