Nov 24, 2022, 2:21 PM IST
వేములవాడ : భూసమస్యల పరిష్కారం కోసమంటూ కేసీఆర్ ప్రభుత్వం తీసుకువచ్చిన ధరణి పోర్టల్ ను వెంటనే రద్దుచేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో కాంగ్రెస్ ధర్నా చేపట్టింది. వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ ఆది శ్రీనివాస్ ఆద్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు బైఠాయించి నిరసన తెలిపారు. ధరణి రద్దుతో పాటు గత ఎన్నికల సమయంలో టీఆర్ఎస్ ఇచ్చిన రైతుల రుణమాఫీ హామీ నెరవేర్చాలని డిమాండ్ చేసారు. రైతుల సమస్యలను పరిష్కరించాల్సింది పోయి సమస్యలు సృష్టించేందుకే ధరణి ఉపయోగపడుతోందని... తద్వారా టీఆర్ఎస్ నాయకులు లాభపడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు. ధరణి పోర్టల్ రద్దుచేయాలంటూ వేములవాడ ఎమ్మార్వోకు కాంగ్రెస్ నాయకులు వినతిపత్రం అందించారు. అంతకుముందు టీఆర్ఎస్ వ్యతిరేక నినాదాలు చేస్తూ కాంగ్రెస్ నాయకులు ఆందోళన చేపట్టారు.