గద్వాల జిల్లా హాస్పిటల్లో ఇదీ పరిస్థితి... కేంద్ర మంత్రి పాండే సీరియస్

Nov 18, 2022, 11:39 AM IST

గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని అద్వాన్న పరిస్థితులపై కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్రనాథ్ పాండే తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసారు. గద్వాల పర్యటనలో భాగంగా స్థానిక బిజెపి నాయకులతో కలిసి కేంద్ర మంత్రి ఏరియా హాస్పిటల్ ను సందర్శించారు. ఈ క్రమంలో హాస్పిటల్లోని బాత్రూంలకు డోర్లు సరిగ్గా లేకపోవడం, విద్యుత్ దీపాలు లేకపోవడంతో పేషెంట్స్ చీకట్లోనే వుండటం ఇలా వివిధ సమస్యలను గుర్తించిన మంత్రి వైద్యసిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసారు. కేంద్ర మంత్రి వస్తున్నారని తెలిసినా ఇదా పరిస్థితి అంటూ సిబ్బందిపై మండిపడ్డారు. అక్కడినుండి జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసిన మంత్రి వెంటనే హాస్పిటల్లోని సమస్యలను పరిష్కరించాలని కేంద్ర మంత్రి పాండే ఆదేశించారు.