Apr 26, 2022, 12:58 PM IST
వరంగల్: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. వరంగల్ పట్టణంలోని భద్రకాళి దేవస్థానం, వేయిస్తంభాల గుడిని వీరు సందర్శించారు. భద్రకాళి అమ్మవారితో పాటు వేయిస్తంబాల గుడిలో కిషన్ రెడ్డి, ఈటల ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయపడిన వారిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎమ్మెల్యే ఈటల పరామర్శించారు.