Nov 10, 2022, 1:22 PM IST
పెద్దపల్లి : ప్రదానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్న పెద్దపల్లి జిల్లా రామగుండం పర్టిలైజర్ ప్యాక్టరీని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి భగవంత్ ఖూబా సందర్శించారు. అలాగే తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర సీరియర్ నాయకులతో కలిసి ప్రధాని పాల్గొనే బహిరంగ సభ ఏర్పాట్లను కేంద్ర మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఖుబా మాట్లాడుతూ.... రామగుండం ఫర్టిలైజర్ ఆండ్ కెమికల్ లిమిటెడ్ ఏడాదికి 12.8 మెట్రిక్ టన్నుల యూరియా ఉత్పత్తి సామర్థ్యం కలిగివుందన్నారు. ఇది అందుబాటులోకి రావడంవల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని... దక్షిణ భారతదేశానికి ఎరువుల కొరత తీరనుందన్నారు. కేంద్ర ప్రభుత్వం ఒక యూరియా బస్తాకు 3500 రూపాయల సబ్సిడీ ఇస్తోందని... కేవలం 200 రూపాయలకే రైతన్నలకు అందిస్తోందని అన్నారు. ఇలాంటి కేంద్ర ప్రభుత్వ పథకాలను టీఆర్ఎస్ ప్రభుత్వం తమవిగా చెప్పుకోవడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి భగవంత్ ఖుబా పేర్కొన్నారు.