పోతురాజులతో కలిసి మంత్రుల స్టెప్పులు... తలసాని, శ్రీనివాస్ గౌడ్ ఊర మాస్ డ్యాన్స్ చూడండి

Jul 19, 2022, 12:18 PM IST

హైదరాబాద్ : గత ఆదివారం ప్రారంభమైన సికింద్రాబాద్ బోనాల సందడి సోమవారం రాత్రి పలహారం బండ్ల ఊరేగింపుతో ముగిసింది. ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో బోనాల ఏర్పాట్ల నుండి పలహారం బండ్ల ఊరేగింపు వరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నీ తానై చూసుకున్నారు. ఆదివారం అమ్మవారికి తలసాని కుటుంబం తొలిబోనం సమర్పించడంతో ప్రారంభమైన సికింద్రాబాద్ బోనాల ఉత్పవాలు సోమవారం తలసాని ఇంటినుండి పలహారం బండి ఊరేగింపుతో ముగిసాయి. తలసాని ఇంటివద్ద మంత్రులు శ్రీనివాస్ గౌడ్, మహమూద్ అలీ పలహారం బండికి ప్రత్యేక పూజలు చేసారు. అట్టహాసంగా సాగిన ఈ ఊరేగింపులో మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్ పోతరాజులతో కలిసి వేసిన ఊర మాస్ స్టెప్పులు హైలైట్ గా నిలిచాయి.