Apr 13, 2020, 11:48 AM IST
హైదరాబాద్ మేడ్చల్ జవహర్ నగర్ లో మూడు మృతదేహాలు కలకలం రేపాయి. జవహర్ నగర్ కార్పొరేషన్ లోని డెంటల్ కాలేజీ డంపింగ్ యార్డ్ దగ్గరున్న మర్రిచెట్టుకు ఇద్దరు యువతుల మృతదేహాలు వేలాడుతూ ఉన్నాయి. చెట్టుకు కాస్త దూరంలో మరో చిన్నారి మృతదేహం ఉంది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆత్మహత్య లేక హత్య అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.