సిరిసిల్ల జిల్లాలో ఘోరం... వాగులో కొట్టుకుపోయిన కారు, ఇద్దరు మృతి

Sep 11, 2022, 4:46 PM IST

సిరిసిల్ల : తెలంగాణ వ్యాప్తంగా రెండుమూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు ప్రమాదాలు సృష్టిస్తున్నారు. వరద నీటితో ప్రమాదకరంగా ప్రవహిస్తున్న వాగులు వంకలు, నదులు... నిండుకుండలా మారిన జలాశయాలు, ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు ప్రాణాలను బలితీసుకుంటున్నారు. ఇలా వరదనీటితో బ్రిడ్జి పైనుండి వెళుతున్న ప్రవాహాన్ని దాటేందుకు ప్రయత్నించిన కారు నీటిలో కొట్టుకుపోయిన ఘటన రాజన్న  సిరిసిల్ల జిల్లాలో చోటుచేసుకుంది. 

వేములవాడ రూరల్ మండలం ఫాజుల్ నగర్ సమీపంలోని వాగు వరదనీటితో మహోగ్రరూపం దాల్చింది. భారీగా వరదనీరు చేరుతుండటంతో రాకపోకల కోసం వాగుపై నిర్మించిన బ్రిడ్జి పైనుండి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహాన్ని అంచనా వేయలేక ఇలా ప్రమాదకరంగా ప్రవహిస్తున్న నీటిలోంచి వెళ్లడానికి కొందరు ప్రయత్నించారు. కారును బ్రిడ్జిపై నుండి పోనివ్వగా వరద ఉదృతికి అమాంతం కారు నీటిలో కొట్టుపోయింది. వెంటనే అక్కడే వున్న జెసిబి సాయంతో స్థానికులు కారులోని ఇద్దరిని కాపాడినా మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.