గోదావరిలో చిక్కుకున్న ఇద్దరు రైతులు... ఎమ్మెల్యే సుమన్ చొరవతో తప్పిన ప్రాణాపాయం

Jul 14, 2022, 3:30 PM IST

మంచిర్యాల : తెలంగాణతో పాటు ఎగువన మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో వరదనీరు పోటెత్తడంతో గోదావరి నది మహోగ్రంగా ప్రవహిస్తోంది. తీరప్రాంతంలోని గ్రామాలను ముంచెత్తుతూ గోదావరి ప్రమాదకరంగా మారింది. ఇలా మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమన్ పల్లి వద్ద ఒక్కసారిగా గోదావరి ప్రవాహం పెరగడంతో ఇద్దరు రైతులు చిక్కుకున్నారు. ఎడ్ల  కోసం నది ఒడ్డుకు వెళ్లిన గట్టయ్య, సారయ్యను ఒక్కసారిగా వరదనీరు చుట్టుముట్టింది. దీంతో ఇద్దరూ దగ్గర్లోని వాటర్ ట్యాంక్ ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. అయితే ఎంతకు వరద తగ్గకపోగా మరింత పెరుగుతుండటంలో బిక్కుబిక్కు మంటూ ట్యాంక్ పైనే కూర్చున్నారు. ఇద్దరు రైతులు గోదావరిలో చిక్కుకున్నట్లు తెలుసుకున్న ఎమ్మెల్యే బాల్క సుమన్ ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారు. అధికారులతో మాట్లాడి ప్రత్యేకంగా హెలికాప్టర్ తెప్పించి ఇద్దరు రైతులను కాపాడారు.