Apr 7, 2023, 12:16 PM IST
హైదరాబాద్ : ప్రయాణికులతో వెళుతున్న ఎలక్ట్రికల్ ఏసి బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.శంషాబాద్ నుండి సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్టాండ్ కు వెళుతుండగా బేగంపేట వద్ద బస్సులో మంటలు చెలరేగాయి. వెంటనే డ్రైవర్ అప్రమత్తమై రోడ్డుపైనే బస్సును నిలిపి ప్రయాణికులను కిందకు దించడంతో పెను ప్రమాదం తప్పింది. దగ్గర్లోని అగ్నిమాపక కేంద్రం నుండి ఫైరింజన్ ఘటనాస్థలికి చేరుకుని మంటలను అర్పివేసింది.