టీఆర్ఎస్ అభ్యర్థిగా శ్రీనివాస్ యాదవ్ ... హుజురాబాద్ లో గొల్లకుర్మల సంబరాలు

Aug 11, 2021, 1:41 PM IST

కరీంనగర్:  హుజురాబాద్ ఉపఎన్నికలో అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను ప్రకటించడంతో గొల్ల కుర్మలు సంబరాలు చేసుకుంటున్నారు. దీంతో హుజురాబాద్ నియోజకవర్గంలోని అన్నిమండలాల్లో డోలు డప్పులు, బాణసంచాలతో సంబరాలు జరుపుకుంటున్నారు గొల్ల కుర్మలు. మరోవైపు యువకుడు, విద్యార్థి సంఘాల నాయకుడిని హుజురాబాద్ బరిలో దించుతున్నందుకు యువజన నాయకులు, ఓయూ విద్యార్థి సంఘాలు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి.