షర్మిల క్యారవ్యాన్ కు నిప్పంటించిన టీఆర్ఎస్ శ్రేణులు... నర్సంపేటలో టెన్షన్ టెన్షన్

Nov 28, 2022, 4:23 PM IST

వరంగల్ : వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలో చేపడుతున్న పాదయాత్ర ఉద్రిక్తతకు దారితీసింది. తమ పార్టీ అధినేత కేసీఆర్, స్థానిక ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డిపై షర్మిల చేసిన వ్యాఖ్యలపై టీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. షర్మిల పాదయాత్ర మార్గంలో ఏర్పాటుచేసిన వైఎస్సార్ టిపి ప్లెక్సీలు, బ్యానర్లను టీఆర్ఎస్ నాయకులు కాలబెట్టారు. ఈ క్రమంలోనే షర్మిల బసచేసే క్యారవ్యాన్ కు కూడా మంటలు అంటుకోగా వెంటనే వైఎస్సార్ టిపి నాయకులు, కార్యకర్తలు మంటలను అదపుచేసారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో టీఆర్ఎస్ శ్రేణులతో పాటు షర్మిలను కూడా పోలీసులు అరెస్ట్ చేసారు.