మునుగోడులో కాంగ్రెస్ కు రెండో స్థానం... బిజెపి పరిస్థితి ఇదే : మంత్రి ప్రశాంత్ రెడ్డి

Oct 25, 2022, 5:07 PM IST

నల్గొండ : మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేసారు.తన స్వలాభం కోసమే రాజగోపాల్ రెడ్డి అమ్ముడుపోయాడని... అందువల్లే ఈ ఎన్నిక వచ్చిందన్నారు.  రూ.18000 వేల కోట్లకు బీజేపీ కోమటిరెడ్డిని కొంటే... కాంగ్రెస్ సర్పంచ్ లకు డబ్బులిచ్చి ఆయన కొంటున్నాడన్నారు. అలాంటిది టీఆర్ఎస్ లో చేరికలపై కిషన్ రెడ్డి మాటలు హాస్యాస్పదంగా వుందన్నారు. 

చౌటుప్పల్ మండలం నాగరామ్ గ్రామంలో యువజన సభ్యులు నిర్వహిస్తున్న వాలీబాల్ టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ కు మంత్రి ప్రశాంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ... మునుగోడులో టీఆర్ఎస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ రెండోస్థానంలో వుంటుందని... బిజెపి అభ్యర్థి రాజగోపాల్ రెడ్డికి డిపాజిట్ కూడా దక్కదని మంత్రి ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు.