Apr 27, 2020, 11:45 AM IST
తెలంగాణ రాష్ట్ర సమితి 20వ వార్షికోత్సవాన్నిపుస్కరించుకుని వరంగల్ జిల్లా హన్మకొండలోని అమర వీరుల స్థూపానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నివాళులర్పించారు. అలాగే దివంగత ఆచార్య జయశంకర్ విగ్రహం వద్ద పూల మాల వేసి నివాళులర్పించారు. మంత్రి ఎర్రబెల్లి సొంతూరు, వరంగల్ రూరల్ జిల్లా పర్వతగిరి లోని పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు.