Aug 3, 2022, 5:06 PM IST
కరీంనగర్ : బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ కు దమ్ముంటే హుజురాబాద్ నడిబొడ్డున తనతో చర్చకు రావాలని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంతో కౌశిక్ రెడ్డి సవాల్ ను ఈటల స్వీకరించాలంటూ తాజాగా హుజురాబాద్ లో భారీ హోర్డింగ్ వెలిసింది. టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హుజురాబాద్ లో జరిగిన అభివృద్దితో పాటు నీ అవినీతి, అక్రమ ఆస్తులపై చర్చకు కౌశిక్ రెడ్డి సిద్దంగా వున్నాడు... నువ్వు కూడా సిద్దమా? అంటూ ఈటలను ప్రశ్నిస్తూ హోర్డింగ్ ప్రత్యక్షమయ్యింది. ఆగస్ట్ 5వ తేదీ ఉదయం 11 గంటలకు హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తా చర్చకు రావాలంటూ ప్లెక్సీ ద్వారా డిమాండ్ చేసారు.