గజ్వేల్ కు పారిపోవడం కాదు... దమ్ముంటే హుజురాబాద్ లో పోటీకి రా..: ఈటలకు కౌశిక్ రెడ్డి సవాల్

Jul 27, 2022, 3:17 PM IST

కరీంనగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ పై గజ్వేల్ లో పోటీ చేస్తానంటూ ఛాలెంజ్ విసిరిన బిజెపి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి ఫైర్ అయ్యారు. హుజురాబాద్ ను అభివృద్ధి చేస్తాడని గెలిపిస్తే ఇక్కడి ప్రజల గోస పట్టించుకోకుండా ఈటల పారిపోతున్నాడని అన్నారు. ఈటలను లీడర్ చేసిందే కేసీఆర్... అలాంటిది ఆయననే మోసం చేసాడన్నారు. ఇప్పుడు హుజురాబాద్ ప్రజలను మోసం చేసి గజ్వేల్లో పోటీ చేస్తానని అంటున్నాడని కౌశిక్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత హుజురాబాద్ లో ఒక్క లక్ష అభివృద్ది పనులయినా చేసావా? అని ఈటలను కౌశిక్ ప్రశ్నించారు. హుజురాబాద్ అభివృద్ధి కి చర్చకు సిద్ధమా? శాసన సభ్యుడిగా నువ్వు....శాసనమండలి సభ్యుడిగా నేను చర్చింద్దాం రా? కొట్టుకోవడం, తిట్టుకోవడం ఇక వద్దు... నీకు దమ్ము, ధైర్యం ఉంటే గజ్వేల్ కు పారిపోవడం కాదు... ఈసారి హుజురాబాద్ లో పోటీకి రా? అంటూ కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే ఈటలకు సవాల్ విసిరారు.