కామన్వెల్త్ గోల్డ్ మెడల్ మెడలో వేసి... యువ బాక్సర్ జరీన్ ను అభినందించిన కవిత

Aug 24, 2022, 4:49 PM IST

 
హైదరాబాద్ : వరల్డ్ బాక్సింగ్ ఛాంపియన్, కామన్వెల్త్ గేమ్స్ స్వర్ణ విజేత నిఖత్ జరీన్ టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిసారు. కామన్వెల్త్ గేమ్స్ మహిళల 50కిలోల విభాగంలో సాధించిన బంగారు పతకంతో కవిత ఇంటికి చేరుకున్నారు యువ బాక్సర్ జరీన్. ఈ సందర్భంగా బంగారు పతకాన్ని కవిత చేతికి అందించగా దాన్ని తిరిగి జరీన్ మెడలో వేసి అభినందించారు. ఈ సందర్భంగా గతంలో తనకు కేసీఆర్ ప్రభుత్వం చేసిన సాయం... అందుకు కవిత చేసిన కృషిని జరీన్ గుర్తుచేసుకున్నారు. 

తెలంగాణ రాష్ట్రంలోని నిజామాబాద్ కు చెందిన బిడ్డ భాక్సింగ్ లో వరల్డ్ ఛాంపియన్ షిప్ గెలవడం,  ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల్లో బంగారం పతకం సాధించడం గర్వకారణమని కవిత అన్నారు. జరీన్ సాధించిన విజయాలు యువ క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తాయని కవిత పేర్కొన్నారు.