Nov 15, 2022, 12:43 PM IST
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇవాళ మంత్రులు హరీష్ రావు, కొప్పుల ఈశ్వర్ తో భేటీ అయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని పలు నియోజకవర్గాల ఎమ్మెల్యేలతో కలిసి హైదరాబాద్ లో మంత్రులతో సమావేశమయ్యారు అయ్యారు కవిత. భోదన్, జగిత్యాల ఎమ్మెల్యే షకీల్, సంజయ్ కుమార్ తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇంటికెళ్ళిన కవిత ఆయా నియోజకవర్గాల అభివృద్ది కార్యక్రమాల గురించి చర్చించారు. ఇక మరోమంత్రి హరీష్ రావుతో కూడా ఇవాళ కవిత సమావేశమయ్యారు. బోధన్ ప్రభుత్వాస్పత్రిలో రోగులు, వారి సహాయకుల ఆకలి తీర్చేందుకు భోజన సదుపాయం కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమ ప్రారంభోత్సవాని రావాల్సిందిగా కవితను మంత్రి హరీష్, బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆహ్వానించారు.