ఎమ్మెల్సీ కవిత శ్రీశైలం యాత్ర... లంబాడా దుస్తుల్లో సరికొత్త లుక్

Sep 24, 2022, 11:23 AM IST

కల్వకుర్తి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తిలో ఘనస్వాగతం లభించింది. భర్త అనిల్ తో కలసి శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి వెళుతున్న కవితకు మార్గమధ్యలో కల్వకుర్తి వద్ద టీఆర్ఎస్, తెలంగాణ జాగృతి శ్రేణులు స్వాగతం పలికారు. పూలుచల్లుతూ, భారీ గజమాలతో తమ నాయకురాలు కవితను సత్కరించారు. ఈ సందర్భంగా జాగృతి నాయకులను కవిత ఆత్మీయంగా పలకరించారు. స్థానిక మహిళలతో కలిసి లంబాడాలు ధరించే వస్త్రాలతో కవిత సరికొత్తగా కనిపించారు.