Mar 4, 2021, 11:59 AM IST
హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి అధికార టీఆర్ఎస్ తరపున మాజీ ప్రధాని పివి నరసింహరావు కూతురు సురభి వాణీదేవి పోటీచేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇవాళ(గురువారం) ఉదయం ఆమె సనత్ నగర్ లోని శ్యామలకుంట పార్క్ లో ప్రచారం నిర్వహించారు. అక్కడికి వచ్చిన వాకర్స్ తో మాట్లాడిన వాణిదేవి తనకు ఓటేయాలని కోరారు. ఈ ప్రచారంలో మంత్రులు గంగుల కమలాకర్ , తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా పాల్గొన్నారు.