May 28, 2021, 10:23 AM IST
కృష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేద మందుపై జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ విమర్శలు గుప్పించారు. జగిత్యాలకు చెందిన పలువురు కరోనా రోగులు ఆనందయ్య మందును వాడి మరింత అనారోగ్యానికి గురయ్యారని... జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించి మందు పని చేసిందా లేదా అని వారిని అడిగి తెలుసుకున్నానని అన్నారు. ఆనందయ్య మందును తీసుకున్న కరోనా బాధితులు కళ్ల మంటతో బాధ పడ్డారు తప్ప కోలుకోలేదన్నారు. కరోనా పేషెంట్లకు వైద్యులు అత్యాధునిక పరిజ్ఞానంతో వైద్య సేవలు అందిస్తున్న సమయంలో కృష్ణపట్నం మందు సరైంది కాదని ఓ వైద్యునిగా చెబుతున్నానని అన్నారు. ఒకవేళ ఆనందయ్ ఇచ్చే మందు తో కరోనా తగ్గితే ఆయనకు పాదాభివందనం చేసి కొనసాగించాలని కోరతామన్నారు.