Dec 14, 2021, 12:18 PM IST
కరీంనగర్: తెలంగాణ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. కరీంనగర్ జిల్లాలో రెండు ఎమ్మెల్సీ స్థానాలనూ టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ అభ్యర్థులు భానుప్రసాద్, ఎల్. రమణ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. టీఆర్ఎస్ ఘన విజయం సాధించడంతో జిల్లా మంత్రి గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.