Mar 19, 2022, 11:50 AM IST
రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో బీజేపీ, టీఆర్ఎస్ కార్యకర్తల మధ్య ఏర్పడిన ఘర్షణ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బీజేపీ నేతలపై పోలీసులు స్వల్ప లాఠీ ఛార్జీ కూడా చేసారు. ఈ ఘటనకు సోషల్ మీడియాలో చేసిన ఓ పోస్టు కారణమని తెలుస్తోంది. మండలంలోని పదిర గ్రామానికి చెందిన సాయికుమార్ అనే బీజేపీ కార్యకర్త సోషల్ మీడియాలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నాడంటూ.. అతని ఇంటికి వెళ్లిన టీఆర్ఎస్ నేతలు కుటుంబసభ్యులను తిడుతూ బెదిరించారు. దీనిపై ఫిర్యాదు చేసేందుకు బీజేపీ నేతలు ఎల్లారెడ్డిపేట పోలీసు స్టేషన్ కు వెళ్లారు. ఇది తెలుసుకున్నటీఆర్ఎస్ నేతలు కూడా పెద్ద ఎత్తున పోలీసు స్టేషన్ కు వచ్చారు. అక్కడే ఇరువర్గాలు ఘర్షణకు దిగారు. ఈ దాడిలో రాంచంద్రం అనే బీజేపీ కార్యకర్తకు తీవ్ర గాయాలయ్యాయి. వృషణాలపై టీఆర్ఎస్ నేతలు కొట్టారని బాధితుడు ఆరోపిస్తూ విలవిలలాడుతూ స్టేషన్ లోనే పడిపోయాడు.