Oct 24, 2021, 1:44 PM IST
తెలంగాణ రాష్ట్ర సమితి అనే వ్యాపార సంస్థలో వాటాల సమస్య వచ్చిందని... అందువల్లే హుజురాబాద్ లో ఎన్నికలు వచ్చాయని టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. టీఆర్ఎస్ వ్యాపార సంస్థలో తనకు వాటా తక్కువ అయ్యిందని ఈటెల ఎండీ కేసీఆర్ ను ప్రశ్నించారు... దీంతో ఆధిపత్య పోరు మొదలైందన్నారు. ఎండీ కేసీఆర్ కు డైరెక్టర్ లాంటి ఈటలకు మధ్య గొడవ ముదిరి కంపెనీ నుంచి ఈటలను బయటకు పంపారన్నారు.
కేసీఆర్ నిజాం ప్రభువు అయితే హరీష్ రావ్ ఖాసీం రిజ్వీ అని రేవంత్ వ్యాఖ్యానించారు. హుజూరాబాద్ కు వచ్చిన టీఆర్ఎస్ నాయకులు అన్ని వర్గాల వారిని, వ్యాపార వాణిజ్య సంస్థల వారినీ బెదిరిస్తున్నారని రేవంత్ ఆరోపించారు.