వినాయకుడి మెడలో వేసిన డబ్బుల దండను మాయం చేసిన దొంగ

Sep 4, 2022, 12:22 PM IST

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని శాంతి యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయక మండపం నుంచి  100 రూపాయల నోట్లతో  వినాయకుని మెడలో వేసిన దండను ఒక దొంగ ఎత్తుకెళ్లాడు. ఎవరూ లేని సమయంలో మండపంలోకి ప్రవేశించి ఆ దండకు ఉన్న డబ్బును తీసుకొని, లెక్కపెట్టుకొని మరి జేబులో పెట్టుకొని అక్కడి నుండి నింపాదిగా జారుకున్నాడు. ఈ మొత్తం తతంగమంతా అక్కడే అమర్చిన  సీసీ , కెమెరాలో రికార్డ్ అయింది. జగిత్యాల పట్టణంలోని వినాయకుడి చేతిలోని లడ్డు మాయం అయిన ఘటన మరువక ముందే ఈ ఘటన కూడా చోటు చేసుకుంది..!