Sep 3, 2022, 4:35 PM IST
సాధారణముగా దొంగలు దేవుడి గుడిలో, మండపాల్లో దొంగతనాలకు పాల్పడితే నగలనో, హుండీలనో ఎత్తుకుపోతారు. కానీ ఈ దొంగ ఎక్కువ పుణ్యం వస్తుందనుకున్నాడో ఏమో కానీ... వినాయకుడి చేతిలోని లడ్డుని దొంగిలించాడు. మాస్కు వేసుకొని వచ్చి మరీ దేవుడి చేతిలోని లడ్డుని దొంగతనం చేసాడు. జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడాలో ఉన్న ఆంజనేయ స్వామి గుడిలో ప్రతిష్టించిన వినాయకుడి చేతిలోని లడ్డుని దొంగ దొంగలించుకుపోతున్న వీడియో సీసీటీవీ లో రికార్డ్ అయింది.