ది లీడర్ ఫ్రం లోకల్ టు గ్లోబల్... కేటీఆర్ బర్త్ డే స్పెషల్ వీడియో

Jul 22, 2022, 5:32 PM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ మంత్రి కేటీఆర్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ టీఆర్ఎస్ ఇంచార్జ్ తలసాని సాయికిరణ్ యాదవ్ తెలిపారు. జూలై 24వ తేదీన తెలంగాణ భవన్ లో పుట్టినరోజు సంబరాలు జరుపుతామని... కేటీఆర్ చేసిన గొప్ప గొప్ప కార్యక్రమాలను వీడియో రూపంలో  విడుదల చేస్తున్నామన్నారు. ది లీడర్ ఫ్రం లోకల్ టు గ్లోబల్ అనే పేరుతో మంత్రి కేటీఆర్ అంచలంచెలుగా ఎదిగిన విధానంపై డాక్యుమెంటరీ రూపంలో విడుదల చేసామన్నారు. సాండ్ ఆర్ట్, త్రిడి వాల్ ఏర్పాటు చేస్తున్నట్లు... రైజ్ ఆఫ్ తెలంగాణ పేరుతో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. కేక్ కటింగ్ ప్రాంతంలో కాళేశ్వరం, దుర్గం చెరువు త్రీడీ గ్రాఫిక్స్ ప్లాన్ చేసామన్నారు. అంతేకాకుండా కళాకారులతో తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలను ఏర్పాటు చేసినట్లు సాయికిరణ్ వెల్లడించారు.