బీహార్ సంస్కృతిని తెలంగాణలో తీసుకురావాలని బీజేపీ కుట్ర చేస్తుంది : మంత్రి గంగుల ఫైర్

Apr 5, 2023, 5:02 PM IST

తొమ్మిదిన్నర ఏళ్లలో టెన్త్ మొదలు పీజీ వరకూ, కానిస్టేబుల్ మొదలు డిప్యూటీ కలెక్టర్ వరకూ ఎన్నో పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించిన ప్రభుత్వం తెలంగాణ అని, కేవలం అధికార దాహంతో శాంతితో ఉన్న తెలంగాణలో చిచ్చుపెట్టి, తెలంగాణ రాష్టంలో అలజడి స్రుష్టించి తెలంగాణ ప్రభుత్వాన్ని, సీఎం కేసీఆర్ ని అప్రతిష్ట పాలు చేయడానికి బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు మంత్రి గంగుల కమలాకర్. ఈరోజు కరీంనగర్లోని తన కార్యాలయంలో మిడియా సమావేశం నిర్వహించిన ఆయన... అధికారం కోసం బండి సంజయ్ చేస్తున్న ప్రయత్నాలే రాష్ట్రంలో తాజా అలజడికి కారణమన్నారు. బాధ్యతాయుతమైన ఎంపీ పదవిలో ఉండి చట్టాన్ని గౌరవించని వ్యక్తి బండి సంజయ్ అని, తనకు వచ్చిన ప్రశ్నాపత్రంపై మొదట పోలీసులకు సమాచారం అందించాల్సిన బాధ్యత లేదా అని బండి సంజయ్ కి సూటి ప్రశ్న వేసాడు మంత్రి గంగుల.