Apr 4, 2023, 3:11 PM IST
గుంటూరు :అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి సవాళ్లు, ప్రతిసవాళ్లతో గుంటూరులో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అంజుమన్ సంస్థకు చెందిన ఆస్తులను ఆక్రమించుకోడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని...వీటి పరరక్షణపై చర్చించేందుకు ఎమ్మెల్యే ముస్తఫా సిద్దమా అంటూ టీడీపీ అధికార ప్రతినిధి నజీర్ మహమ్మద్ సవాల్ విసిరారు. అంజుమాన్ షాదీఖాన వద్దకు చర్చకు రావాలని పిలుపుతో భారీగా చేరుకున్న మైనారిటీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.