Apr 11, 2022, 3:14 PM IST
న్యూడిల్లీ: తెలంగాణ రైతులు పండించిన వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనాలని డిమాండ్ చేస్తే టీఆర్ఎస్ పార్టీ ప్రజాప్రతినిధులంతా దేశ రాజధాని డిల్లీలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షలో సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేల, ఎమ్మెల్సీ, ఎంపీలు ఇలా ప్రజాప్రతినిధులందరితో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులు వరికంకులు, నాగళ్లతో నిరసన స్థలికి చేరుకున్నారు. నిరసన కార్యాక్రమానికి ముందు ఏర్పాటుచేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.