Jun 2, 2020, 12:34 PM IST
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కరీంనగర్ తీగల గుట్టపల్లి తెలంగాణ భవన్, మంత్రి క్యాంపు కార్యాలయం, కలెక్టరేట్ కార్యాలయాల్లో మంత్రి గంగుల కమలాకర్ జెండా ఆవిష్కరించారు. అమర వీరుల స్థూపం, ప్రొ జయశంకర్, తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాల వేశారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ తెలంగాణ గడ్డమీద కేసీఆర్ పుట్టడం తెలంగాణ ప్రజల అదృష్టం అని కేసీఆర్ పుట్టిన గడ్డమీద నేను పుట్టడం నా అదృష్టం అని పేర్కొన్నారు.