యాసంగి వడ్లు కొంటామన్న కేసీఆర్ ... ఆనందంలో రైతుల పాలాభిషేకం

Apr 13, 2022, 12:56 PM IST

తెలంగాణ రైతులు పండించిన యాసంగి వడ్లను కొంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడాన్ని హర్షిస్తూ కరీంనగర్ జిల్లాలోని  దుర్షేడ్  గ్రామంలో రైతులు సీఎం కేసీఆర్ మంత్రి గంగుల కమలాకర్  కటౌట్ లకు పాలాభిషేకం నిర్వహించారు. బుధవారం గ్రామంలోని వరి పొలంలో అభిషేకం నిర్వహించి అసలైన రైతు బాంధవుడు ముఖ్యమంత్రి కేసీఆర్ అని నినాదాలు చేశారు. అనంతరం రైతులు మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రైతులను నట్టేట ముంచాలని చూస్తే సీఎం కేసీఆర్ ప్రతి గింజలు తామే కొంటామని ప్రకటించి మరోసారి రైతు పక్షపాతి అని నిరూపించారన్నారు..