Nov 18, 2022, 1:31 PM IST
హైదరాబాద్ : నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కు సీఎం కేసీఆర్ కూతురు, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గుర్తుపెట్టుకో అరవింద్... ఇంకోసారి నాగురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతానంటూ కవిత హెచ్చరించారు. చూస్తూ ఊరుకుంటుంటే తమాషాలు చేస్తున్నాడని... బాష లేదు, పద్దతిలేదు, మాట లేదు... కేసీఆర్ అన్న గౌరవం లేదు ఇంకొకరన్న మర్యాద లేదంటూ అరవింద్ పై కవిత మండిపడ్డారు. ఇక అరవింద్ ను విడిచిపెట్టే ప్రసక్తే లేదని... అతడు ఎక్కడ పోటీచేస్తే తాను అక్కడ పోటీ చేసి ఓఢిస్తానని కవిత ఛాలెంజ్ చేసారు.