Aug 31, 2022, 2:12 PM IST
పెద్దపల్లి : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపల్లి బహిరంగసభలో జాతీయ రాజకీయాలు, కేంద్ర ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ కు బిజెపి రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు గుజ్జుల రామకృష్ణారెడ్డి కౌంటరిచ్చారు. ముఖ్యమంత్రిగా సొంత రాష్ట్రంలో వెలగపెట్టలేని కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళతానని అనడం హాస్యాస్పదంగా వుందన్నారు. కలెక్టరేట్ పేరుతో పార్టీ కార్యాలయాల ప్రారంభోత్సవాలను చూస్తుంటే ప్రభుత్వ కార్యక్రమంలా కాకుండా పార్టీ కార్యక్రమంలా కనిపిస్తోందన్నారు. రాష్ట్ర రాజకీయాలు చేతగాకే దేశ రాజకీయాలంటూ కేసీఆర్ నాటకాలాడుతున్నారని... ఇది కేసిఆర్ అవివేకానికి నిదర్శనమని రామకృష్ణారెడ్డి మండిపడ్డారు.