Jun 7, 2021, 2:29 PM IST
కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ ప్రక్షాలన ప్రారంభం అయ్యిందన్నారు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్. టిఆర్ఎస్ పార్టీ గడిల పార్టీ అని... ఆ పార్టీ తెలంగాణలో రాక్షస పాలన సాగిస్తోందని మండిపడ్డారు. టిఆర్ఎస్ పార్టీతో పాటు ఎమ్మెల్యే, ఎంపిల అవినీతి చిట్టా మొత్తం బయటికి తీస్తున్నామని... ముఖ్యమంత్రి కేసీఆర్ కి గుణపాఠం తప్పదని సంజయ్ హెచ్చరించారు.కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని ఇటీవల మృతి చెందిన బిజెపి దళిత మోర్చా రాష్ట్ర కార్యదర్శి రవి ఠాగూర్ కుటుంబ సభ్యులను ఆ పార్టీ పరామర్శించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ... ఉద్యమకారులకి భారతీయ జనతా పార్టీ రక్షణ కల్పిస్తుందన్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ అనే ఉద్యమకారుడికే ఈ విధంగా జరిగిందంటే మిగితా వాళ్ళు కూడా ఆలోచించుకోవాలన్నారు.తెలంగాణ రాష్ట్రం లో ఉద్యమకారులు కనుమరుగు అయ్యారని సంజయ్ పేర్కొన్నారు.