Aug 24, 2022, 3:52 PM IST
హైదరాబాద్ : డిల్లీ లిక్కర్ స్కాంతో తన కూతురు కవితకు సంబంధాలున్నట్లు బయటపడగానే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుట్రలకు తెరతీసాడని రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. తన బిడ్డను కాపాడుకునేందుకు ఆయన దేనికైనా సిద్దపడతాడని... అందులో భాగంగానే హైదరాబాద్ లో అల్లర్లకు కుట్ర పన్నారని ఆరోపించారు. లిక్కర్ స్కాంలో తన కూతురి ప్రమేయంపై జరుగుతున్న చర్చకు పక్కదారి పట్టించేందుకే కేసీఆర్ కుట్రలు పన్నుతున్నట్లు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసారు. కరీంనగర్ లో చేపట్టిన నిరసన దీక్ష అనంతరం బండి సంజయ్ మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ డైరెక్షన్ లోనే తన పాదయాత్రను అడ్డుకునే ప్లాన్ జరిగిందన్నారు. అమరుల చితి మంటలతో కేసీఆర్ కుటుంబం చలి కాచుకుంటోందని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా మహాసంగ్రామ పాదయాత్ర ఆపబోనని బండి సజయ్ స్పష్టం చేసారు.