Dec 12, 2022, 4:54 PM IST
జగిత్యాల : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన కూతురు కవితపై తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కేసీఆర్ బిడ్డ కవిత దొంగసారా దందా మాత్రమే కాదు పత్తాల దందా కూడా చేసిందంటూ సంజయ్ సంచలన ఆరోపణలు చేసారు. దొంగ దందాలు చేసి దండుకున్న కవితను సిబిఐ విచారిస్తే తప్పేముందని అన్నారు. లంగ, దొంగ దందా చేస్తే పులి బిడ్డలా? కేసీఆర్ పులి, కవిత పులి బిడ్డా...? అంటూ సంజయ్ ఎద్దేవా చేసారు.
ఒకప్పుడు కారుకు లోన్ కట్టలేని వ్యక్తి దేశంలోనే అతి ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా ఎలా ఎదిగిండు? అని సంజయ్ నిలదీసారు. తెలంగాణలో చెల్లని రూపాయి కేంద్రంలో చెల్లుతుందా? కేసీఆర్ దేశ రాజకీయాల్లో ఏం పీకలేడని బండి సంజయ్ మండిపడ్డారు.