Aug 24, 2022, 12:53 PM IST
కరీంనగర్ : తెలంగాణ బిజెపి నాయకుల అరెస్టులు, బండి సంజయ్ ప్రజాసంగ్రామ పాదయాత్రకు పోలీసుల అనుమతి నిరాకరణ నేపథ్యంలో ఇవాళ (బుధవారం) రాష్ట్రవ్యాప్త నిరసనలకు బిజెపి పిలుపునిచ్చింది. ఈ క్రమంలో కరీంనగర్ లోని తన నివాసం వద్ద రాష్ట్ర బిజెపి చీఫ్ బండి సంజయ్ కూడా నిరసన దీక్ష చేపట్టాడు. ఇవాళ ఉదయం 11గంటలకు రాష్ట్రంలోని అన్ని జిల్లా, మండల కేంద్రాల్లోని బిజెపి కార్యాలయాల వద్ద ప్రారంభమైన దీక్ష మధ్యాహ్నం 1గంటల వరకు కొనసాగనుంది. బండి సంజయ్ నిరసన దీక్ష నేపథ్యంలో కరీంనగర్ లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నారు. ఇప్పటికే సంజయ్ ఇంటివద్ద భారీగా పోలీసులు మొహరించగా బిజెపి శ్రేణులు కూడా భారీగా చేరుకుంటున్నారు. దీంతో అక్కడి టెన్షన్ వాతావరణం నెలకొంది.