Aug 23, 2022, 11:20 AM IST
తెలంగాణ బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని జనగామలో పోలీసులు అరెస్ట్ చేసారు. డిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ కవిత ఇంటి ముట్టడికి యత్నించిన బిజెపి కార్యకర్తలపై పెట్టిన హత్యాయత్నం కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ జనగామలో ప్రజాసంగ్రామ యాత్రాస్థలంలోనే ధర్మ దీక్షకు దిగారు సంజయ్. ఈ దీక్షను భగ్నం చేసిన పోలీసులు సంజయ్ ని అరెస్ట్ చేసారు. అయితే బండి సంజయ్ ని తరలిస్తున్న పోలీస్ వాహనాన్ని బిజెపి శ్రేణులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత చెలరేగింది. పోలీసులు, బిజెపి శ్రేణులకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. బండి సంజయ్ అరెస్ట్ సమయంలో ప్రజాసంగ్రామ పాదయాత్ర ఉద్రిక్తంగా మారింది. భారీగా మొహరించిన పోలీసులు సంజయ్ అరెస్టుకు యత్నించగా బిజెపి కార్యకర్తలు ఆఞన చుట్టూ భద్రతా వలయంగా నిలబడ్డారు. అయితే వారిని దాటుకుని సంజయ్ వద్దకు చేరుకున్న పోలీసులు అరెస్ట్ చేసారు. వందలాది మంది పోలీసులతో పాదయాత్ర శిబిరంవద్దకు చేరుకోవడంతో ఏక్షణం ఏం జరుగుతుందనే ఆందోళన నెలకొంది.