సికింద్రాబాద్ బోనాలకు ఘనంగా ఏర్పాట్లు... చేనేత మగ్గంపై మహంకాళి అమ్మవారి చీర తయారీ

Jul 14, 2022, 5:29 PM IST

హైదరాబాద్ : ఆషాడమాసంలో అంగరంగ వైభవంగా జరిగే బోనాల పండగ కోసం సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి ఆలయం ముస్తాబవుతోంది.  వచ్చే ఆదివారం అంటే 17వ తేదీన జరిగే బోనాల ఉత్సవంలో అమ్మవారికి అలంకరించే చీరను ప్రత్యేకంగా మగ్గంపై తయారుచేయనున్నారు. ఈ చీర తయారీ పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. అనంతరం బోనాల సందర్భంగా సికింద్రాబాద్ పరిధిలోని 91 దేవాలయాలకు ప్రభుత్వం మంజూరు చేసిన ఆర్ధిక సహాయం చెక్కులను మంత్రి అందిచారు. అంతకుముందు రాష్ట్రంలో వర్షాలు ఆగాలని మహంకాళి ఆలయంలో నిర్వహించిన వరుణ శాంతి హోమంలో మంత్రి శ్రీనివాస్ యాదవ్ పాల్గొన్నారు.