Oct 25, 2022, 2:57 PM IST
వరంగల్ : ప్రభుత్వ దవాఖానాకు వెళితే ప్రాణాలు దక్కడం అటుంచి ప్రాణాలు పోయేలా వుంది. హాస్పిటల్లోకి విషపూరిత పాముల ప్రవేశించి రోగుల బెడ్ల వద్దకు చేరుకుంటున్నాయంటే పరిస్థితి ఎంత అద్వాన్నంగా వుందో అర్థమవుతుంది. ఇలా తెలంగాణలోని వరంగల్ పట్టణంలో మహాత్మాగాంధీ మెమోరియల్ (ఎంజిఎం) హాస్పిటల్లో పాము కలకలం రేపింది. రెండునెలల క్రితం ఇలాగే హాస్పిటల్లోకి పాము ప్రవేశించగా తాజాగా మరోసారి కలకలం రేగింది. తమ బెడ్ల వద్దకు పాము చేరుకోవడాన్ని గుర్తించిన రోగులు, వారి సహాయకులు జాగ్రత్తపడటంతో పెను ప్రమాదం తప్పింది. వరంగల్ లోని అతిపెద్ద ప్రభుత్వాస్పత్రిలో పరిస్థితి ఇంత అద్వానమా అంటూ సామాన్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.