Aug 14, 2022, 2:01 PM IST
సిరిసిల్ల : భారత స్వతంత్ర వజ్రోత్సవ వేడుకలు తెలంగాణలో ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఓ చేనేత కార్మికుడు తన ప్రతిభతో దేశభక్తిని చాటుకున్నాడు. నేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ రెండుమీటర్ల వస్త్రంపై త్రివర్ణ పతాకంతో ఉన్న భారతదేశ చిత్రపటాన్ని, బంగారు జరి అంచులతో జాతీయ గీతాన్ని నేసి అద్భుతాన్ని ఆవిష్కరించాడు. నాలుగురోజుల పాటు శ్రమించి దీన్ని తయారుచేసినట్లు నేతన్న హరిప్రసాద్ తెలిపారు.