సింగరేణి కార్మికుడు మృతి... డాక్టర్ల నిర్లక్ష్యమే కారణమంటూ కార్మిక సంఘాల ఆందోళన

Sep 28, 2022, 5:01 PM IST

పెద్దపల్లి : గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా హాస్పిటల్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఓ కార్మికుడు మృతిచెందాడంటూ అతడి బంధువులు,  కార్మిక సంఘాల నాయకులు ఆందోళనకు దిగారు. గోదావరిఖనికి చెందిన శ్రీనివాస్ సింగరేణిలో టిప్పర్ డ్రైవర్ గా పనిచేసేవాడు. అయితే ఐదురోజుల క్రితం అతడు విధుల్లో వుండగా అకస్మాత్తుగా స్పృహతప్పి పడిపోయాడ.  దీంతో అతడిని వైద్యం కోసం సింగరేణి హాస్పిటల్ కు తరలించారు. అయితే అక్కడ అతడి పరిస్థితి మరింత దిగజారడంతో ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించడానికి కుటుంబసభ్యులు సిద్దమయ్యారు. కానీ డాక్టర్లు ఎలాంటి ప్రమాదం లేదని చెప్పి అక్కడే వుంచుకున్నారని బాధిత కుటుంబం తెలిపింది. ఇలా రోజురోజుకు శ్రీనివాస్ పరిస్థితి వికటించి ఇవాళ తెల్లవారుజామున రక్తం కక్కుకుని మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబం, కార్మిక సంఘాల నాయకులు హాస్సిటల్ వద్ద ఆందోళనకు దిగారు.