Apr 27, 2020, 11:51 AM IST
అమెరికాలోని సిద్ధిపేట్ ఎన్ఆర్ఐ గ్రూపుల సభ్యులు వేణు నక్షత్రం, శ్రీధర్ గుడాల, శ్రీకాంత్, మహేష్ కర్వాలు ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలిపారు. గోదావరి జలాలు సిద్ధిపేటకు రావడమనే కలను సాకారం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. అంతేకాదు సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ జిల్లాలోని ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రంగనాయకసాగర్ ద్వారా ఇప్పుడీ జిల్లాలు సస్యశ్యామలం కాబోతున్నాయని, కరువు కోరలనుండి, నీటి కొరతనుండి బయటపడబోతున్నాయని హర్ఫం వ్యక్తం చేశారు. దీనికి కారణం కేసీఆర్ దూరదృష్టేనని, తెలంగాణ తెచ్చుకోవడం వల్లే ఇది సాధ్యమైందంటున్నారు.