సిద్దిపేట జిల్లాలో ప్రకృతి అందాలు... జలాశయాన్ని తలపిస్తున్న శనిగారం చెరువు

Oct 11, 2021, 4:25 PM IST

సిద్దిపేట: ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జలాశయాలు, చెరువుల నిండుకుండల్లా మారాయి. ఇక నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జలకళను సంతరించుకోవడంతో జలాశయాల అందాలు పెరిగి మరింత ఆహ్లాదకర వాతావరణ ఏర్పడింది. ఇలా సిద్దిపేట జిల్లా బెజ్జంకి సమీపంలోని శనిగారం చెరువులో నీరు మత్తడి దుంకుతూ చిన్నపాటి జలాశయాన్ని తలపిస్తోంది. ఈ అందాలను ఆస్వాదించేందుకు బెజ్జంకి వాసులు ఆసక్తి చూపుతున్నారు.