సికింద్రాబాద్ అగ్ని ప్రమాదం ... మంటలు అంటుకున్నాయిలా..!

Sep 14, 2022, 2:51 PM IST

సికింద్రాబాద్ రూబీ  లాడ్జీలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంపై కేంద్ర రవాణా శాఖ దర్యాప్తును ప్రారంభించింది.  రూబీ లాడ్జీ భవనం ఉన్న సెల్లార్ లో మంటలు వ్యాపించాయి. అయితే ఈ మంటలకు ఈ బైక్స్ లో బ్యాటరీల పేలుడే కారణమనే అనుమానాలు  వ్యక్తమౌతున్నాయి.ఈ  బైక్స్ ఓవర్ చార్జీంగ్ కారణంగా పేలుడు చోటు చేసుకుందనే అనుమానాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.రూబీ లాడ్జీ ఉన్నభవనం సెల్లార్ లో ఉన్నఈ బైక్స్ బ్యాటరీల పేలుడుతోనే అగ్ని ప్రమాదం జరిగిందని అగ్ని మాపక శాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. ఓవర్ చార్జింగ్ కాారణంగానే ఈ ప్రమాదం జరిగిందనే అభిప్రాయాలను అధికారులు వ్యక్తం చేస్తున్నారు.  దాని తాలూకు వీడియో చూడండి.