Rx100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ పై పెద్దపల్లిలో కేసు

Aug 21, 2021, 12:12 PM IST

కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించారనే ఆరోపణపై పెద్దపల్లి పోలీసు స్టేషన్ లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ పాయల్ రాజ్ పుత్  మీద కేసు నమోదైంది. జులై 11వ తేదీన ఆమె వెంకటేశ్వర షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. అయితే మాస్క్ ధరించకుండా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారని పెద్దపల్లికి చెందిన బొంకూరు సంతోష్ బాప్ జీ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.