Aug 5, 2022, 3:59 PM IST
సిద్దిపేట : ప్రయాణికులతో బయలుదేరిన ఆర్టిసి బస్సు బస్టాండ్ దాటిందోలేదో ప్రమాదానికి గురయ్యింది. భారీ క్రేన్ ను ఢీకొట్టి బస్సు బోల్తాపడటంతో ఆర్టిసి సిబ్బందితో పాటు ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడిన దుర్ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో చోటుచేసుకుంది.
హైదరాబాద్ కు వెళ్ళే ప్రయాణికులతో హుస్నాబాద్ బస్టాండ్ నుండి బస్సు బయలుదేరింది. అయితే బస్టాండ్ నుండి బయటపడిందో లేదో భారీ క్రేన్ ను తరలిస్తున్న ట్రక్కును ఢీకొట్టింది. దీంతో బస్సు బోల్తాపడగా డ్రైవర్ తో పాటు ఐదుగురు ప్రయాణికులు గాయపడ్డారు. క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎంకు తరలించి చికిత్స అందిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన ఆర్టిసి డ్రైవర్ పరిస్థితి విషమంగా వున్నట్లు సమాచారం.