Jun 25, 2022, 11:27 AM IST
జగిత్యాలలో ఓ డాక్టర్ యాక్సిడెంట్ చేశాడు. ఆ తరువాత ఏమీ తెలీనట్టు.. పారిపోయి.. తన క్లినిక్ లో ఓపీ చూస్తున్నాడు. సీసీ టీవీ ఫుటేజ్ లో గుర్తించిన కుటుంబ సభ్యులు ఆ డాక్టర్ ను చితకబాదారు. జగిత్యాల : జగిత్యాల జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైక్ ఢీ కొన్నాయి. ఓ వ్యక్తి పై నుండి కారు దూసుకెళ్లడంతో తీవ్ర గాయాలయ్యాయి. అయితే, కారులోని వ్యక్తి కారును ఆపకుండా.. కారుతో సహా పరారయ్యాడు. ఆ తరువాత క్షతగాత్రుడు ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఘటన సీసీటీవీ విజువల్స్ పరిశీలించగా యాక్సిడెంట్ చేసింది ప్రయివేటు ఆస్పత్రి వైద్యుడు డా. అర్జున్ గా తెలిసింది. యాక్సిడెంట్ చేసి ఏమి తెలియనట్టు తన ప్రైవేట్ ఆస్పత్రిలో ఓపి చూస్తుండగా బాదితుని కుటుంబ సభ్యులు చితకబాదారు. డాక్టర్ అయ్యుండి మానవత్వం లేకుండా వ్యవహరించాడని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.